టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లను నిజం చేస్తూ, దర్శకుడు రాజ్ నిడిమోరును ఈరోజు ఆమె వివాహం చేసుకున్నారు.వీరిద్దరి పెళ్లి వేడుక సో కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో జరిగింది. ఈ వివాహ వేడుకకు అతి తక్కువ మంది అతిథులు, దాదాపు 30 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్ నిడిమోరు ,డీకేతో కలిసి రాజ్ & డీకేగా ప్రాజెక్టులు చేస్తుంటారు. దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.రాజ్ &డీకే డైరెక్షన్ లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అనిపించుకుంది.రాజ్ నిడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నారు.రాజ్ గతంలో శ్యామలి దేని వివాహం చేసుకోగా, 2022లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇక సమంత ఇంతకుముందు నాగచైతన్యను 2017లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు.అయితే,పరస్పర అంగీకారంతో 2021లో ఈ జంట విడిపోయింది.ఆ తరువాత నాగ చైతన్య ,శోభిత దూళిపాళ్ల ను పెళ్లి చేసుకోగా ఇక ఇప్పుడు సమంత ,రాజ్ నిడిమోరు తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























