బేబీ తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్లింప్స్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్య, మాస్టర్ డిగ్రీ అందుకున్న తర్వాత తన ఫ్రెండ్స్‌తో కలిసి, తనకు కాబోయేవాడి గురించి ఎలివేషన్ ఇస్తుంటుంది.ఆ తర్వాత హీరోగా ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఉంటుంది. తనకు కాబోయే అబ్బాయి క్వాలిటీస్ చెప్పాక ఆనంద్ దేవరకొండ గద్దర్ గెటప్ లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తించింది.
ఇది శేఖర్ కమ్ముల సినిమాలో హీరోలాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీ” అని ఆనంద్ చెప్పే డైలాగ్ తో గ్లిమ్ప్స్ ఎండ్ అయ్యింది. ఓవరాల్ గా గ్లింప్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచేసింది.
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, అజీమ్ మహమ్మద్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి కూర్పు అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య ఈసినిమాను నిర్మిస్తుండగా త్వరలోనే భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























