యాక్షన్ షెడ్యూల్ లో పెద్ది

High-Octane Action Schedule Underway for Peddhi

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌కు, ‘చికిరి’ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన గురించి అందరికీ తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మాత.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ‘పెద్ది’ని భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ‘పెద్ది’ బృందం రామ్ చరణ్, ఇతర ఫైటర్లతో పాటు కీలకమైన, హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. ఈ షూటింగ్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడ ఈ భారీ యాక్షన్ బ్లాక్‌కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది.

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాకి హైలైట్‌ కానుందని, అందుకే మేకర్స్ షామ్ కౌశల్‌ను సంప్రదించారు. ఈ సీక్వెన్స్‌కు సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ చిత్రీకరణను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా పర్ఫెక్షనిస్ట్ అన్న సంగతి తెలిసిందే. ప్రతీ యాక్షన్ సెగ్మెంట్ పైనా చాలా శ్రద్ధ చూపిస్తుంటారు. ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా రూపొందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.