మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా మాస్ జాతర తో రాగ ఆ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది.ఇక నెక్స్ట్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా ఈరోజు సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేశారు మేకర్స్. బెల్లా బెల్లా అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యాలానే వుంది. క్యాచీ ట్యూన్స్ , రవితేజ ఎనర్జిటిక్ స్టెప్స్ కి తోడు ఫారెన్ లొకేషన్లు ఈ సాంగ్ కి అదనపు ఆకర్షణ గా నిలువనున్నాయి.ఫుల్ సాంగ్ డిసెంబర్ 1న ఉదయం 10 :08 గంటలకు విడుదలకానుంది.
ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉండగా దేనికవే యూనిక్యూ స్టైయిల్తో ఆకట్టుకోనున్నాయి .రవితేజ ఈసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఫ్రెష్ కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా వస్తున్నాడు.ఈసినిమాను కిషోర్ తిరుముల డైరెక్ట్ చేస్తుండగా ఆషికా రంగనాథ్ ,డింపుల్ హయతి హీరోయిన్లు గా నటించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈసినిమా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























