ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది. అయితే యూఎస్ఏ లో ఈసినిమా అదరగొట్టింది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు నార్త్ అమెరికాలో 275 k డాలర్లను రాబట్టుకొని రామ్ కెరీర్ లో హైయెస్ట్ డే 1 గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 1 మిలియన్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. రామ్ కు ఇదే మొదటి మిలియన్ డాలర్ సినిమా కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా తొలి రోజు పర్వాలేదనిపించింది. వర్కింగ్ డే కావడంతో ఆ ప్రభావం కనిపించింది. అయితే ఈరోజు నుండి సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది. ఓవరాల్ గా చూస్తే మొదటి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.
ఫ్యాన్ బయోపిక్ గా మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. వివేక్ -మెర్విన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రస్తుతం రామ్ , భాగ్య శ్రీ యూఎస్ఏ లో ఈసినిమా ప్రమోట్ చేసే పనిలో వున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























