ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం తన నాలుగో సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.ఇటీవలే ఈసినిమా అనౌన్స్ మెంట్ కూడా చేశారు. ప్రముఖ దివంగత హీరో కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈసినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది.రీసెంట్ గానే ఈసినిమా షూట్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈరోజు టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈసినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ను ఖరారు చేశారు.త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా రానుంది.
ఇక ఈసినిమాతో ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.అంతేకాదు ఈసినిమాలో ఓ సీనియర్ స్టార్ యాక్టర్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.తమిళ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా జెమినీ కిరణ్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























