చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా స్పిరిట్ మూవీ లాంచ్

Prabhas Spirit Gets a Majestic Launch from Chiranjeevi

ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ స్పిరిట్ ఘనంగా ప్రారంభమైయింది. ఈ ముహూర్త వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ గా అలరించింది.పాన్-ఇండియా పవర్‌హౌస్ ట్యాలెంట్ ని ఒకచోట చేర్చి మొదటి షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పటికే సెన్సేషనల్ హ్యాట్రిక్ హిట్‌లను అందించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ను పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. T-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సందీప్ రెడ్డి వంగా బ్లాక్ బస్టర్ యానిమల్‌లో తన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రి, ఈ చిత్రంలో ప్రభాస్‌ కి జోడిగా నటించనుంది. ఈ కొత్త జోడీ వెండితెరపై కొత్త ఎనర్జీని తీసుకురానుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, ప్రముఖ నటి కాంచన కీలక పాత్రల్లో కనిపిస్తారు.ప్రభాస్ పుట్టినరోజున నిర్మాతలు ఇటీవల ఒక ప్రత్యేకమైన “సౌండ్-స్టోరీ” ఆడియో టీజర్‌ను ఆవిష్కరించారు.ఎటువంటి విజువల్స్ లేనప్పటికీ ఈ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

స్పిరిట్‌ను ప్రపంచవ్యాప్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా రూపొందిస్తున్నారు. తొమ్మిది భాషలలో విడుదల చేయబోతున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది చివర్లో విడుదలచేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.