మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఈనెలలో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక ఈసినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి తో తనకు ఇది మూడో సినిమా
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో నయనతార, శశిరేఖ గా కనిపించనుంది.ఈరోజు నయనతార బర్త్ డే కావడంతో సినిమానుండి తన పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది టీం.రీసెంట్ గా చిరు ,నయనతార లపై వచ్చిన మీసాల పిల్ల సాంగ్ 60 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా సినిమాకి స్పెషల్ ఆకర్షణగా నిలువనుంది.
మన శంకరవరప్రసాద్ గారు లో విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో కనిపించనుండగా క్యాథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక తెలుగులో నయనతార మరో సినిమా కూడా ఓకే చేసింది.నటసింహం బాలకృష్ణ – డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న NBK 111 లో నయనతార ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో తను రాణి పాత్రలో కనిపించనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























