భారతీయ సినీ పరిశ్రమలో 50 ఏళ్ళ అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న తెలుగు సినిమా ఐకాన్, లెజెండరీ నందమూరి బాలకృష్ణ గారిని ప్రత్యేకంగా సన్మానించనున్న 56 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (IFFI)సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC), గోవా ప్రభుత్వంతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ESG) సంయుక్తంగా నిర్వహిస్తున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) ఈ ఏడాది నవంబర్ 20న జరగనున్న ఆరంభ వేడుకలో సౌత్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ లనుఘనంగా సత్కరించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ సినీ రంగంలో అర్ధ శతాబ్ద కాలం పాటు తమ అపూర్వమైన నటనతో, దాదాపు 100కిపైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రజినీకాంత్ , బాలకృష్ణ ల 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని IFFI 2025 ప్రత్యేకంగా జరుపుకోనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, కళాకారులు, ప్రతినిధులు, సినీభిమానుల సమక్షంలో ఆయనకు ఈ గౌరవాన్ని అందించనున్నారు.
ఆరంభ వేడుకలో ప్రముఖ నిర్మాణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సాంస్కృతిక బృందాలు పాల్గొనే అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇందులో భాగమవుతాయి. ఇవి భారతీయ కథా సంప్రదాయం, సంస్కృతి, సినీప్రతిభను ప్రతిబింబిస్తాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























