గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని 3డీలోనూ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బిగ్ రివిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన మీడియా మిత్రులకు, నందమూరి అభిమానులకు, త్రీడీ ఎక్స్పీరియన్స్ ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి, అందరికీ ధన్యవాదాలు. బాలకృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాని 3డీ ఫార్మాట్లోనూ తీసుకొస్తున్నాం. త్రీడీలో ఈ సినిమా చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈ చిత్రం.. భారతదేశ ఆత్మ, పరమాత్మ.
ఈ సినిమా మన దేశ ధర్మం, ధైర్యం. ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ, మన దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లల నుంచి అమ్మానాన్నల వరకు థియేటర్స్ లో అద్భుతంగా చూస్తారు. అది నా బాధ్యత. నేను మీకు ఇస్తున్న హామీ. ఈ సినిమాని దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ప్రచారాన్ని ముంబయి నుంచి ప్రారంభించాం. భగవద్గీత, రామాయణం, భారతం. ఇవి మన దేశం ఆత్మ. ఈ మూడిటికి ఉన్న ఆత్మే అఖండ2. అందుకే ఈ సినిమా ఈ దేశ ఆత్మ పరమాత్మ అని చెప్పాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























