విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’.ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది.ఈనెల 28న ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.ఇక ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసినిమాకు కె. చంద్రు దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలో అలాగే ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో కీర్తి సురేశ్ ‘రీటా’ అనే సామాన్య మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. అనూహ్య పరిస్థితులు ఆమెను తుపాకీ (రివాల్వర్) పట్టుకునేలా చేస్తాయి. ఆ తరువాత ఆమె ఎలాంటి సాహసాలు మరియు సవాళ్లను ఎదుర్కొంది అనేదే ఈ సినిమా యొక్క ప్రధాన కథాంశం.
ఫన్ ఎలెమెంట్స్ తో యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాకు సీన్ రోల్డన్ సంగీతం అందిస్తుండగా సుధాన్ సుందరం,జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. మరి ఈసినిమా కీర్తి సురేష్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























