ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా కేవలం పాటలతోనే ప్రేక్షకుల్లో సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల కాగా, అవన్నీ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఈ రోజు ఈ సినిమా నుండి నాలుగవ పాట కూడా రిలీజైయింది. విమల్ థియేటర్ లో అభిమానులు ఈ సాంగ్ లాంఛ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటూ సాగే ఈ పాట ఫుల్ సెలబ్రేషన్ మోడ్‌లో వుంది. ఈ FDFS పాట ఆ ఉత్సాహం, ఆ క్రేజ్ మొత్తాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. సినిమా పట్ల అభిమానుల ఇష్టం, ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభూతిని ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించింది. అభిమానులను లేచి కేకలు వేయించేలా, డాన్స్ చేయించేలా, ఆ మ్యాజిక్ మూమెంట్ లో పూర్తిగా మునిగిపోయేలా చేస్తుంది. ఈ సాంగ్ అందరి హీరోల అభిమానులకు చాలా రోజులు గుర్తుండిపోనుంది.దినేష్ ఈ పాటను రచించాడు.ఇక తెలుగులో మొదటి సినిమాతో చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్.ఓవరాల్ గా సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. నెక్స్ట్ ఈ సినిమా నుండి ట్రైలర్ రానుంది.
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు.రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























