బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన కుమార్తె ఈషా డియోల్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె సంచలన ప్రకటన చేస్తూ, తన తండ్రి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను ఖండించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈషా డియోల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెడుతూ, “మీడియా ఓవర్ డ్రైవ్‌లో మునిగిపోయి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. నా తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు” అని స్పష్టం చేశారు.
89 ఏళ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్యాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఆయన ఆరోగ్యంపై జాతీయ మీడియాలో వివిధ రకాల ఊహాగానాలు, నిన్నటి వరకు వెంటిలేటర్‌పై ఉన్నారనే కథనాలు వచ్చాయి.ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచినట్లు వచ్చిన వార్తలను తాజాగా ఈషా డియోల్ ఖండించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























