ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. కేవలం సాంగ్స్ తోనే సూపర్ హైప్ తెచ్చుకుంటుంది.ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అవ్వగా అన్ని చార్ట్ బస్టర్ అనిపించుకున్నాయి.ఇక రేపు ఈసినిమా నుండి నాలుగో పాట కూడా రానుంది.ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాగే పాట ఫుల్ సెలబ్రేషన్ మోడ్ లో ఉండనుంది.అందులో భాగంగా ఈరోజు సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ సాంగ్ అందరు హీరోల ఫ్యాన్స్ కి చాలా రోజులు గుర్తిండిపోనుంది. రేపు ఈసాంగ్ ను హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో లాంఛ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా , కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు.రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వివేక్ & మర్విన్ సంగీతం అందిస్తుండగా ఈసినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్లే సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు రామ్. సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























