తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ జన నాయగన్ నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. దళపతి కచేరి అంటూ వచ్చిన ఈ మాస్ సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించేలా వుంది.విజయ్ వోకల్స్ ,అనిరుధ్ సంగీతం సాంగ్ లో హైలైట్ అయ్యాయి. అరివు ఈ సాంగ్ ను రచించాడు.త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కానుంది.ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఎలాంటి వాయిదా లేకుండా పొంగల్ కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా ఆడియో లాంఛ్ మలేషియా లో డిసెంబర్ 27న గ్రాండ్ గా జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఇక తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా రిలీజ్ కానుంది. అయితే అయితే సంక్రాంతికి తెలుగు నుండి పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.దాంతో జన నాయకుడు తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోనుంది.
ఇక విజయ్ కి ఇదే చివరి సినిమా కానుంది. ఇప్పటికే పొలిటికల్ గా ఫుల్ బిజీ అయిపోయిన విజయ్ జన నాయకుడు తో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు.వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగనున్నాయి.ఈ ఎన్నికలు టార్గెట్ గా విజయ్ పార్టీ బరిలోకి దిగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























