కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం కె-ర్యాంప్. ఈసినిమా గత నెల దీపావళికి విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. రివ్యూస్ అంత సానుకూలంగా రాకపోయినా మౌత్ టాక్ తో ఫుల్ రన్ లో 30కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టుకొని విజయాన్ని సాధించింది. ఇక ఈసినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 15 నుంచి కె-ర్యాంప్ ఆహా లో అందుబాటులోకి రానుంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్ వీకే, సాయికుమార్, కామ్నా జెఠ్మలానీ కూడా ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికి వస్తే, ధనవంతుడి కొడుకు అయిన కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) తండ్రి గారాబంతో చదువును నిర్లక్ష్యం చేస్తూ సరదాగా తిరుగుతుంటాడు. అతన్ని దారిలో పెట్టాలని తండ్రి (సాయికుమార్) కేరళలోని ఒక కాలేజీలో చేరుస్తాడు. అక్కడికి వెళ్లిన కుమార్ తన మామ (నరేశ్)తో కలిసి అల్లరిగా గడుపుతుంటాడు. ఒకసారి అతిగా మద్యం సేవించి ఊపిరాడక ఇబ్బంది పడుతున్న కుమార్‌ను మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) కాపాడి, ప్రమాదం నుంచి గట్టెక్కిస్తుంది. ఈ క్రమంలో కుమార్ ఆమెను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే మెర్సీని ఎప్పటి నుంచో ఒక సమస్య వేధిస్తుంటుంది. ఆ సమస్య ఏంటి? అది తెలిసిన తర్వాత కూడా కుమార్ ఆమెను అంతే ప్రేమించాడా? లేక ఆమెకు దూరమయ్యాడా? వారిద్దరి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























