మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుండి నిన్న విడుదలైన ఫస్ట్ సాంగ్ ఊహించినట్లుగానే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో వచ్చిన చికిరి చికిరి సాంగ్ యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ తో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.కేవలం తెలుగులోనే ఈసాంగ్ 24గంటల్లో 29 మిలియన్ల కుపైగా వ్యూస్ తో ఆల్ టైం సౌత్ నెంబర్ 1 లిరికల్ వీడియో సాంగ్ గా నిలిచింది. ఇంతకుముందు అల్లు అర్జున్ పుష్ప 2 నుండి వచ్చిన కిస్సిక్ సాంగ్ 24గంటల్లో సింగిల్ లాంగ్వేజ్ లో 27 మిలియన్లకు పైగా వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండగా పెద్ది ఆ రికార్డు బ్రేక్ చేసి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది.కేవలం తెలుగులోనే కాదు ఈ పాట హిందీలో కూడా సెన్సేషనల్ వ్యూస్ తో అదరగొడుతుంది.హిందీలో 24గంటల్లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.అన్ని భాషల్లో కలిపి 40మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి హ్యుజ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.తాజాగా ఈపాటను తమిళంలో కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోహిత్ చౌహన్ వోకల్స్ ,ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ ,చరణ్ డ్యాన్స్ ,జాన్వీ కపూర్ ,విజువల్స్.. సాంగ్ ను రిపీట్ గా చూసేలా చేశాయి.ఓవరాల్ గా సాంగ్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది పెద్ది టీం. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న ఈసినిమా ఇప్పటివరకు 70 శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.డిసెంబర్ లోగా షూట్ కంప్లీట్ చేసి చెప్పిన తేదీ కి రిలీజ్ రిలీజ్ చేయనున్నారు.
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.పెద్ది వచ్చే ఏడాది 27న థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























