మత్తు వదలరా కాంబోలో మరో సినిమా 

Mathu Vadalara Combo Reunites for a New Film

సెన్సేషనల్ మత్తువదలరా కాంబినేషన్ మరోసారి అలరించబోతోంది. కల్ట్ హిట్ అయిన మత్తు వదలరాతో తో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత మరో బ్లాక్‌బస్టర్ సీక్వెల్ మత్తువదలరా 2 విజయాన్ని అందుకున్న రితేష్ రానా తన నాల్గవ డైరెక్షనల్ మూవీని ప్రకటించారు.యూనిక్ స్టయిల్ నరేషన్ తో ఆకట్టుకునే రితేష్ రానా మరోసారి సత్యతో జతకడుతున్నారు.ఇది ప్రేక్షకులకు మరో నవ్వుల విందును అందించనుంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పాత్ర కథలో కీలకం కానుంది.మత్తు వదలరా ఫ్రాంచైజీలో భాగమైన వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

అఫీషియల్ గా చిత్రాన్ని ప్రకటిస్తూ, మేకర్స్ ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.మత్తువదలరా టీం మరోసారి ఒక్కటవడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. రితేష్ రాణా మార్క్ హ్యూమర్, క్రియేటివిటీతో కూడిన పూర్తి స్థాయి లాఫ్టర్ రయట్ కోసం సిద్ధమవుతున్నారు.రితేష్ రానా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.