సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 నుండి ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా సినిమా టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తుండగా, రాజమౌళి ముందుగా మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి సప్రైజ్ ఇచ్చారు.ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో పృథ్వీరాజ్ రోబోటిక్ ఛైర్ లో కూర్చొని ఇంటెన్స్ లుక్ లో కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పృథ్వీరాజ్ పోషిస్తున్న పాత్ర పేరు ‘కుంభ’ అని వెల్లడించారు.ఈ లుక్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ మునుపెన్నడూ కనిపించనంతగా క్రూరమైన పాత్రను పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాజమౌళి తన సినిమాల్లో విలన్ పాత్రలను ఎంత పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తారో మరోసారి ఈ లుక్‌తో నిరూపించారు.’కుంభ’ పాత్ర యొక్క ఇంటెన్సిటీ చూసిన అభిమానులు, సినిమాలో హీరో మహేష్ బాబుకు పృథ్వీరాజ్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని రాజమౌళి తెలిపారు. ఈ సినిమా గురించిన అధికారిక వివరాలు,టైటిల్ మరియు మహేష్ బాబు గ్లింప్స్ కోసం నవంబర్ 15న ‘గ్లోబ్ ట్రాటర్’ పేరిట హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌తో మొదలైన ఈ సర్‌ప్రైజ్ ట్రీట్‌లు, నవంబర్ 15న జరగబోయే ముఖ్య ఈవెంట్ వరకూ కొనసాగుతాయని రాజమౌళి ప్రకటించారు.
సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పృథ్వీరాజ్ లుక్ విడుదలైన ఈ క్షణం, నవంబర్ 15 కోసం అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది.నెక్స్ట్ ఈసినిమా నుండి ప్రియాంక చోప్రా పాత్రను పరిచయం చేయనున్నారు. అందుకు సంబధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























