తమిళ అగ్ర నటులు రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు ఐదు దశాబ్దాల స్నేహానికి గుర్తుగా ఒక మెగా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, రజినీకాంత్ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. రజినీకాంత్ కు ఇది 173 వ సినిమా. ఈ తలైవర్ 173 చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుందర్ సి గతంలో రజినీకాంత్‌తో ‘అరుణాచలం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని, కమల్ హాసన్‌తో ‘అన్బే శివం’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాన్ని తీశారు.రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ పొంగల్ 2027 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు.నెల్సన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో వుంది. డిసెంబర్ లోపు సినిమాను పూర్తి చేయనున్నారు. ఇక ఈసినిమాను కంప్లీట్ చేసి రజినీకాంత్ తన 173వ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. హిప్ హప్ తమిళ ఈసినిమాకు సంగీతం అందించే ఛాన్స్ వుంది. త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























