పెద్ది సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్

Renowned Bollywood Singer to Lend Voice for Peddi Song

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. రీసెంట్ గా శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక పెద్ది ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.అందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ మసకలీ ఫేమ్ మోహన్ చౌహన్ చేత ఈసాంగ్ పాడించారు.దాంతో సాంగ్ మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసి ఈనెల 8న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పెద్ది షూటింగ్ విషయానికి వస్తే 70 శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.పెద్దిలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.

మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.డిసెంబర్ లోగా షూట్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు.అయితే ముందు రోజు శ్రీరామ నవమి కావడంతో 26నే రిలీజ్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.