ఈఏడాది స్టార్టింగ్ లో తండేల్ తో వచ్చి ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన 24 వ సినిమా చేస్తున్నాడు.మిస్టరీ థ్రిల్లర్ గా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. సగం షూట్ కూడా కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో తను దక్ష అనే పాత్రలో ఆర్కియాలజిస్ట్ గా కనిపించనుంది.ఈరోజు తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇందులో నాగ చైతన్య అర్జున్ అనే పాత్రలో స్టైలిష్ గా కనిపించనుండగా బాలీవుడ్ నటుడు , లపతా లేడీస్ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.ఈనెలలో ఈసినిమానుండి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ విఎఫ్ఎక్స్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా ఎస్విసిసి బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై టాప్ డైరెక్టర్ సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చైతన్య కెరీర్ కు ఈసినిమా టర్నింగ్ పాయింట్ కానుంది. త్వరలోనే టైటిల్ చెప్పనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























