కేవలం సాంగ్స్ తోనే సినిమా చూడాలనే హైప్ క్రియేట్ అవుతుంది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి.ఉస్తాద్ రామ్ పోతినేని – మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈరోజు తో షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఈసినిమా నుండి రీసెంట్ గా వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యి ఆల్బమ్ పై అంచనాలు పెంచగా నిన్న విడుదలైన మూడో సాంగ్ ఆ రెండు పాటలకు మించి రీచ్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిన్ని గుండెలో అంటూ వచ్చిన ఈసాంగ్ యూట్యూబ్ లో 24గంటల్లో ఏకంగా 15 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని రికార్డు సృష్టించింది.బ్యూటిఫుల్ మెలోడీ గా అర్థవంతమైన,లిరిక్స్ తో క్యాచీ ట్యూన్స్ తో వచ్చిన ఈ సాంగ్ లూప్ మోడ్ లో వినేలా వుంది. సాంగ్ చిత్రీకరణ కూడా బాగుంది.ఈ సాంగ్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టారు నిర్మాతలు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా మెర్విన్ సోలమన్ ,సత్య యామిని పాడారు.జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు.అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నాడు.తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది. అయితే ఈసినిమాను కుదిరితే ఒక రోజు ముందుగా 27నే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























