కెజియఫ్ తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్, తన తదుపరి చిత్రం టాక్సిక్ విషయంలో తీసుకుంటున్న అధిక జాగ్రత్తల కారణంగా ఈ ప్రాజెక్ట్ డోలాయమానంలో పడిందని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చిత్రీకరించిన ఫుటేజ్ విషయంలో యష్ సంతృప్తి చెందకపోవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపేసారని మరికొంత కాలం స్క్రిప్ట్‌పై మళ్లీ కసరత్తు చేయాలని యష్ ఆమెకు సూచించినట్లు దాంతో టాక్సిక్ అనుకున్న తేదీకి రాకపోవచ్చని గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని తాజాగా టీం క్లారిటీ ఇచ్చింది.షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.సినిమా విషయంలో వచ్చిన వదంతులు నమ్మొద్దు. సినిమా చెప్పిన తేదీ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుందని మేకర్స్ కంఫర్మ్ చేశారు. అభిమానులకు నిజంగా ఇది గుడ్ న్యూసే.
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార , కియరా అద్వానీ నటిస్తుండగా భారీ బడ్జెట్ తో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. కెజియఫ్ 2 తరువాత యష్ నుండి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది.
ఇక యష్ ఈసినిమాతో పాటు హిందీ లో రామాయణ అనే సినిమా కూడా చేస్తున్నాడు.నితీష్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో యష్ రావణాసురిడిగా కనిపించనున్నాడు.రామాయణ రెండు భాగాలుగా రానుండగా మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























