తెలుగు సినీ పరిశ్రమలోకి మరో స్టార్ వారసురాలు అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తొలిసారిగా కథానాయికగా ఒకరు పరిచయం కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, ప్రముఖ నిర్మాత మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

జాన్వీ స్వరూప్‌కి సినిమాలంటే కొత్త కాదు. 2010లో సందీప్ కిషన్ హీరోగా,మంజుల దర్శకత్వంలో వచ్చిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో ఆమె బాల నటిగా పదేళ్ల వయసులోనే తెరపై కనిపించింది. ఆ తర్వాత తన చదువుపై దృష్టి పెట్టిన జాన్వీ, నటనతో పాటు డ్యాన్స్ వంటి ఇతర రంగాలలోనూ శిక్షణ తీసుకుని మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఉన్నత విద్యను పూర్తి చేసుకుని, నటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

జాన్వీ తాజాగా విడుదల చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కనిపించిన దానికి పూర్తి భిన్నంగా, స్టైలిష్ లుక్స్‌లో సరికొత్తగా దర్శనమిచ్చిన జాన్వీని చూసి కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోషూట్ ఆమె సినిమా ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు, కృష్ణగారి కుమారుడు, దివంగత రమేశ్ బాబు వారసులు కూడా సినీ రంగంలోకి రాబోతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జాన్వీ కూడా సిద్ధమవుతుండడం ఘట్టమనేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























