అలా చేస్తేనే టికెట్ ధరల పెంపు :సీఎం రేవంత్ రెడ్డి  

CM Revanth Reddy Sets Conditions for Ticket Price Increase

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలనచిత్ర కార్మికుల సంక్షేమానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. నిన్న యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో  సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభ గ్రాండ్ గా జరిగింది.టి ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డిని  గజ మాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్బంగా సినీ కార్మికుల సంక్షేమం కోసం  రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు.సినీ కార్మికులకు అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా రంగాల తరహాలోనే సినిమా పరిశ్రమను కూడా ఒక ముఖ్యమైన రంగంగా గుర్తిస్తున్నామని, భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ రంగానికి సముచిత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

టికెట్ ధరల పెంపుపై షరతు :

టికెట్ల ధరల పెంపు గురించి సీఎం రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమైన షరతు విధించారు. భవిష్యత్తులో నిర్మాతలు సినిమా టికెట్ల ధరలు పెంచదలిస్తే, అదనంగా వచ్చే ఆదాయం నుంచి 20 శాతాన్ని తప్పనిసరిగా సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలని ఆయన సూచించారు. నిర్మాతలు దీనికి అంగీకరిస్తేనే ఇకపై టికెట్ల ధరలు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని స్పష్టం చేశారు.

హాలీవుడ్‌ను ఆహ్వానిద్దాం :

తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోందని, ఆస్కార్ అవార్డులు గెలుచుకుందని సీఎం ప్రశంసించారు. తెలుగు సినిమా విజయాల కారణంగానే బాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమలు మనల్ని అనుకరిస్తున్నాయని అన్నారు. “రామోజీ ఫిల్మ్ సిటీకి హాలీవుడ్‌ను రప్పిద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను భవిష్యత్తులో హాలీవుడ్ చిత్రాల నిర్మాణాలకు వేదికగా నిలపడానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.డిసెంబర్ 9న మరోసారి సినీ కార్మికులతో సమావేశమై ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను మరింత వివరంగా వివరిస్తామని సీఎం తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.