సమంత మా ఇంటి బంగారం స్టార్ట్

Samantha’s MAA Inti Bangaram Begins

రెండేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత పూర్తిస్థాయి తెలుగు చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె నటిస్తూ, తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకురాలు నందిని రెడ్డితో పాటు, సమంతకు సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ అండ్ డీకే ద్వయంలో ఒకరు) కూడా పాల్గొన్నారు. రాజ్ నిడిమోరు ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టడం విశేషం.

‘ఖుషీ’ తర్వాత సమంత నటిస్తున్న ఈ పూర్తి స్థాయి తెలుగు సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బేబీ’ వంటి హిట్ కాంబినేషన్ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేస్తున్న సినిమా ఇదే కావడం మరో విశేషం. ఈ సినిమాను ప్రేమాభిమానాల మధ్య ప్రారంభించామని, తాము ఏం సృష్టిస్తున్నామో ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆత్రుతగా ఉన్నామని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కాగా, ఈ మధ్య కాలంలో సమంత ఎక్కడికెళ్లినా ఆమె వెంట రాజ్ నిడిమోరు కనిపిస్తుండడం, ఆయన కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం వంటి సంఘటనల నేపథ్యంలో, వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఇక ఖరారైనట్లేనని సినీ వర్గాలు, అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం సమంత, రాజ్ నిడిమోరుతో కలిసి రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. ఈ తెలుగు సినిమా మా ఇంటి బంగారంతో పాటు, సమంత మరిన్ని ప్రాజెక్ట్‌లతో బిజీ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.