మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మహా రాజా రవితేజ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మాస్ జాతర.ఇది తనకు 75వ చిత్రం.ఈ ల్యాండ్ మార్క్ మూవీని సూపర్ హిట్ మూవీ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు డైరెక్ట్ చేశాడు. తనకు డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా.ఆడియో సూపర్ హిట్ అవ్వడం టీజర్ ప్రామిసింగ్ గా అనిపించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారు. రేపు ఈ ఈవెంట్ సాయంత్రం 5:30 గంటల నుండి జె ఆర్ సి కన్వెన్షన్ లో జరుగనుంది. ఈ ఈవెంట్ కు తమిళ స్టార్ హీరో సూర్య చీఫ్ గెస్ట్ గా రానున్నాడు.
కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా శ్రీలీల హీరోయిన్ నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సివుంది. ముందుగా ఈనెల 31న రిలీజ్ చేయాలనుకున్నారు అయితే ఆ డేట్ కి బాహుబలి ది ఎపిక్ కూడా రిలీజ్ అవుతుండడం తో అదే రోజు సాయంత్రం నుండి ప్రీమియర్స్ వేసి నవంబర్ 1న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఇక వరుస పరాజయాలతో కొనసాగుతున్న రవితేజ మాస్ జాతరతో సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
మరోవైపు రవితేజ ప్రస్తుతం తన 76వ సినిమాలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈసినిమా కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























