నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్-కామెడీ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది.థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక అందమైన ప్రేమకథగా తెరకెక్కింది.ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మించారు.
ఇక ఈ ఏడాది రష్మిక నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, మంచి బజ్ ఉన్న ఈ ది గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు దృష్టి సారించాయి. ఇప్పటికే హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























