రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది.రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ తో కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. కాంతార: చాప్టర్ 1 విజువల్ వండర్ గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడీ సినిమా మరో మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.ఈ ఇంగ్లీష్ వెర్షన్ లో రన్ టైం తగ్గించారు. 2 గంటలు 14 నిమిషాలు 40 సెకన్లు రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.
కాంతార: చాప్టర్ 1 కేవలం తెలుగులోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లు కలెక్ట్ చేసింది.ఇక కన్నడలో ఈసినిమా బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతరకి ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార: చాప్టర్ 1 ఫుల్ రన్ లో 1000కోట్ల మార్క్ చేరుకుంటుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























