ఆర్యన్ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

Vishnu Vishal's Aaryan Trailer Receiving Amazing Response

కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ మరియు ఫస్ట్ సింగిల్‌కి మంచి స్పందన వచ్చిన తర్వాత, తాజాగా మేకర్స్ నెయిల్-బైటింగ్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

httpv://www.youtube.com/watch?v=9BG57jiP\u002d\u002dw

ఒకప్పుడు కొడైకెనాల్ సీరియల్ కిల్లింగ్ కేస్‌ని సాల్వ్ చేసిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, ఇప్పుడు టెర్రిఫిక్ సైకోపాత్‌ని పట్టుకునే మిషన్‌లోకి వస్తాడు. కిల్లర్ ప్రతి హత్యకు గంట ముందు పోలీసులను ఛాలెంజ్ చేస్తూ మర్డర్ చేసే వారి పేరు చెబుతుంటాడు. దీంతో నగరమంతా భయంతో వణుకుతుంది. ఈ క్రమంలో, ఆఫీసర్ తన అనుభవం, తెలివి, ఇన్‌స్టింక్ట్‌లతో హంతకుడి ఆటను ఛేదించే ప్రయత్నం చేస్తాడు.

కిల్లర్‌ని ఎలా పట్టుకుంటాడు? అనేదే కథలో మెయిన్ ఎక్సయిటింగ్ ఎలిమెంట్. దర్శకుడు ప్రవీణ్ కె ఒక యూనిక్ కథను ఎంచుకుని, ఆఫీసర్‌–కిల్లర్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. విష్ణు విశాల్ తన పాత్రలో చాలా కమాండింగ్‌గా కనిపించాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.

సెల్వరాఘవన్ చివర్లో ఎంట్రీ ఇస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అతని ప్రెజెన్స్ ఇంపాక్ట్ కలిగిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్స్‌గా కనిపించారు. హరీష్ కన్నన్ కెమెరా వర్క్ సినిమాకి థ్రిల్లింగ్ టోన్ ఇచ్చింది, గిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్‌లలో టెన్షన్‌ని పీక్స్‌కి తీసుకెళ్లింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై క్లాస్‌లో ఉన్నాయి.

సాయి రోణక్, తరక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. స్క్రీన్‌ప్లే కి‘ఎఫ్‌ఐఆర్’ దర్శకుడు మను ఆనంద్ సహరచన చేశారు. ఎడిటర్ సాన్ లోకేశ్. కాగా, ఆర్యన్ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి (శ్రేష్ట్ మూవీస్) గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.