దీపావళి కానుకగా.. న్యూ ఫిల్మ్ నుండి శివాజీ ఫస్ట్ లుక్ రిలీజ్

Actor Sivaji Introduced as Panchayati Secretary Sriram From New Project

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌పై రెండవ ప్రాజెక్టుగా సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వంలో వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ నటుడు శివాజీ, లయ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి శివాజీ పనిచేస్తున్నారు. 90’s వెబ్ సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుండి పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ చూస్తుంటే గ్రామీణ వాతావరణంలో శ్రీరామ్ తన కుటుంబంతో కలిసి దీపావళి పండుగ చేసుకునేందుకుగాను దీపావళి పటాసులు తీసుకుని వెళుతున్నట్లు అర్థమవుతుంది. అయితే, ఈ మూవీ టైటిల్, చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలు చిత్ర బృందం వెల్లడించాల్సి ఉంది.

ఈ చిత్రంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్‌గా కనిపించనున్న శివాజీ ఎంతో నిజాయితీపరుడైన వ్యక్తి. తప్పుని సమర్ధించని మనస్తత్వం, అన్యాయాన్ని సహించలేని క్యారెక్టర్. తన వల్ల మాత్రమే కాదు, ఏ ఒక్కరి వల్ల కూడా జనం ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే మనిషి. భార్య బిడ్డలే ఇతని ప్రపంచం. వాళ్ళని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. వాళ్ళ దాకా వస్తే ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడని మనిషి పాత్రలో శివాజీ నటిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.