ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల చివర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సమ్మర్ వరకు కంటిన్యూ గా షూట్ చేయనున్నారు. అయితే ముందు ప్రకటించినట్లు జూన్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈసినిమా థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాల తరువాతే ఓటీటీ లోకి వచ్చేలా నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నారు. అన్ని భాషలకు గాను గాను నెట్ ఫ్లిక్స్ రికార్డు ధరకు ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. 8 వారాల తరువాతే ఓటీటీ లోకి రానున్నడం తో హిందీలో ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కెజిఎఫ్ , కెజిఎఫ్ 2 తో ప్రశాంత్ నీల్ అలాగే ఆర్ఆర్ఆర్ , దేవర సినిమాలతో ఎన్టీఆర్ నార్త్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ , మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈసినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారం లో వుంది.
ఇక ఈసినిమా కంప్లీట్ చేసి ఎన్టీఆర్ , దేవర 2 ను స్టార్ట్ చేయనున్నాడు.గత ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన దేవర 400కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది . దాంతో దేవర 2 పై భారీ అంచనాలు వున్నాయి. కొరటాల శివ ఈసినిమాను తెరకెక్కించనుండగా యువ సుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























