ఒకప్పుడు **విక్రమార్కుడు’ సినిమాలో రవితేజతో “రేయ్ సత్తి బాల్ ఇటు వచ్చిందా” అనే డైలాగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బాలనటుడు రవి రాథోడ్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. చిన్నతనంలోనే 25కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రవి, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోవడంతో వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకుని మద్యానికి బానిసయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో సెట్ వర్కర్‌గా జీవనం సాగిస్తూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే రవి పరిస్థితి గురించి తెలిసిన ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ గతంలో అతడిని దత్తత తీసుకుని పాఠశాలలో చేర్పించారు. కానీ, రవి అక్కడి నుంచి పారిపోయి తిరిగి తన పాత జీవితం వైపే వెళ్లిపోయాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి – “లారెన్స్ అన్న చాలా మంచి మనిషి. నన్ను స్కూల్‌లో చేర్పించాడు కానీ నేనే తప్పు చేశాను. ఇప్పుడు నన్ను చూస్తే ఆయన కొడతాడు” అని బాధతో చెప్పాడు. ఆ వీడియో లారెన్స్ దృష్టికి వెళ్లడంతో ఆయన కదిలిపోయారు. అనంతరం సోషల్ మీడియాలో స్పందిస్తూ – “రవి, నిన్ను తిట్టను, కొట్టను. దయచేసి వచ్చి నన్ను కలవు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను” అని కోరారు.
దీంతో రవి చెన్నై వెళ్లి ఆయనను కలిసారు. ఈ సందర్భంగా ఇరువురూ కలిసున్న ఫోటోను రవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. రవిని స్నేహపూర్వకంగా కలిసిన లారెన్స్, అతని మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించబోతున్నారని తెలిసింది. మానవత్వం చాటుకున్న లారెన్స్ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హృదయాలను తాకుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























