మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి నిన్న విడుదలైన మొదటి పాట ‘మీసాల పిల్ల’ సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్‌లో పెద్ద సెన్సేషన్‌గా మారింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి, చిరంజీవి ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మెలోడీకి భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా.. సీనియర్ లిరిసిస్ట్ భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉదిత్ నారాయణ్ మ్యాజిక్:
ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, ఎన్నో ఏళ్ల తర్వాత లెజెండరీ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ మళ్లీ తెలుగులో మెగాస్టార్ కోసం తన మధురమైన గాత్రాన్ని అందించారు. ఉదిత్ నారాయణ్ వాయిస్‌లోని గమ్మత్తు, చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్‌తో కలవడంతో ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చార్ట్‌బస్టర్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉదిత్, ఈ పాటతో మరోసారి మ్యాజిక్ చేశారు. ఆయనతోపాటు శ్వేతా మోహన్ గాత్రం అదనపు ఆకర్షణగా నిలిచింది.
చిరు స్టైల్.. డ్యాన్స్ బీట్:
‘మీసాల పిల్ల’ కేవలం పాట మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి స్టైల్, ఎనర్జీకి అద్దం పడుతోంది. పాటలో చిరు వేసిన మార్క్ స్టెప్స్, ఆయన లుక్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చాయి. అలాగే నయనతార తన నటనతో మరో ఎస్సెట్‌గా నిలిచింది. ఈ పాట డ్యాన్స్ బీట్.. యూత్‌ను కూడా ఆకట్టుకునేలా ఉండడంతో, సోషల్ మీడియా రీల్స్‌లో ఇది ట్రెండ్‌ను సెట్ చేస్తోంది.
దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ పాట పక్కా హిట్టయ్యింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా ఈ పాట ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























