డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. గత నెలలోనే ఈసినిమా టైటిల్ రిలీజ్ అవ్వాల్సివుండగా వాయిదా వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఈ లాంగ్ షెడ్యూల్ లో యాక్షన్స్ సీక్వెన్స్ తోపాటు సాంగ్స్ షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది. పూరి మార్క్ ఎంటర్టైనర్ లో తెరకెక్కుతున్న సినిమాలో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనునున్నారు.యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక వరుస పరాజయాలతో కొనసాగుతున్న పూరి జగన్నాథ్ ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























