హిందీలో ప్రభంజనం సృష్టిస్తోన్న కాంతార చాప్టర్ 1

Kantara Chapter 1 Registers Massive Collections at Hindi Box Office on 2nd Week

రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించి, భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ కలెక్షన్లతో, ‘కాంతార చాప్టర్ 1’ హిందీ ప్రేక్షకులు కూడా కథకు, రిషబ్ శెట్టి నటనకు ఎంతగా కనెక్ట్ అయ్యారో స్పష్టమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండో వీకెండ్‌లోనూ వసూళ్ల సంచలనం!

‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ రెండో వారాంతంలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకున్నాయి. దీనిప్రకారం, శుక్రవారం రూ.7.10 కోట్లు, శనివారం రూ.14.37 కోట్లు, ఆదివారం రూ.14.65 కోట్లు వసూలు చేసింది. రెండో వారాంతపు మొత్తం రూ.36.12 కోట్లుగా ఉంది. తద్వారా ఓవరాల్‌గా మొత్తం 10 రోజుల్లో రూ.146.22 కోట్లు అందుకుంది.

దీపావళికి ముందు మరో వీకెండ్ గోల్డెన్ ఛాన్స్!

‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ కేవలం 10 రోజుల్లోనే రూ. 146.22 కోట్లు వసూలు చేసి, రూ. 150 కోట్ల మార్క్‌కు చేరువైంది. అక్టోబర్ 21న దీపావళి పెద్ద సినిమాలు విడుదలయ్యే వరకు, ఈ చిత్రానికి అక్టోబర్ 17 నుండి 19 వరకు మరో ఓపెన్ వీకెండ్ లభించింది. ఈ అదనపు వారాంతం సినిమా ఓవరాల్ కలెక్షన్స్‌ కు మరింత బలాన్ని చేకూర్చి, ఘనమైన మొత్తం సాధించడానికి అవకాశం ఉంది. అదే జరిగితే, ఈ చిత్రం త్వరలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరేఅవకాశం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.