డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.టీజర్ కూడా రెడీ గా వుంది. 75 సెకండ్ల నిడివితో ఈ టీజర్ రానుంది.రేపు రిలీజ్ డేట్ చెప్పనున్నారు.ఈవారంలోనే ఈ టీజర్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో కనిపించనుండగా అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నాడు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తుండగామైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది.
ఈసినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని రామ్ చూస్తున్నాడు.ఫ్యాన్స్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా పై భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా కూడా బాగా వస్తుందట. సో రామ్ ఈసినిమాతో కం బ్యాక్ ఇవ్వడం పక్కా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























