వా వాతియార్ విడుదల తేదీ ఖరారు

Vaa Vaathiyaar Release Date Announced

తమిళ హీరో కార్తీ వా వాతియార్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమాకు మధ్యలో అనేక అడ్డంకులు వచ్చాయి. దాంతో షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక మేకర్స్ ఈరోజు రిలీజ్ డేట్ ను ప్రకటించారు.డిసెంబర్ 5న వా వాతియార్ థియేటర్లోకి రానుంది.అయితే అదే రోజు మచ్ అవైటెడ్ మూవీ అఖండ 2 విడుదలకానుండడంతో వా వాతియార్ కు తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నలన్ కుమారస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది. ఇక ఈసినిమాతోపాటు కార్తీ ,సర్దార్ 2 కూడా ఫినిష్ చేశాడు.ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.మిత్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మాళవిక మోహనన్ ,ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తుంది.త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఇక కార్తీ ప్రస్తుతం మార్షల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.తమిళ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.