తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్టైల్, ఫన్నీ స్పీచులతో సంచలనం సృష్టించే మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తాజాగా టాలీవుడ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు తనకు భారీ ఆఫర్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విలన్ పాత్ర కోసం హరీష్ శంకర్ సంప్రదింపులు
ఈ మేరకు దసరా పండుగ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా మల్లారెడ్డి కామెంట్స్ స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ స్వయంగా తనను సంప్రదించారని మల్లారెడ్డి తెలిపారు.
“దర్శకుడు హరీష్ శంకర్ మా కాలేజీకి వచ్చి, నాకోసం గంట సేపు వేచి చూశారు. ఆయన సినిమాలోని విలన్ పాత్రలో నటిస్తే రూ.3 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.” అని వెల్లడించారు.
ఆ ఆఫర్‌ను తిరస్కరించడానికి కారణం ఇదే!
అయితే, భారీ పారితోషికం ఆఫర్ చేసినా తాను ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్లు మల్లారెడ్డి నవ్వుతూ వివరించారు. దానికి గల కారణాన్ని ఆయన తనదైన శైలిలో ఫన్నీగా తెలిపారు..
“విలన్‌గా చేస్తే ఇంటర్వెల్ వరకు నేను హీరోను తిడతాను, కొడతాను. కానీ, ఇంటర్వెల్ తర్వాత హీరో నన్ను కొడతాడు, తిడతాడు. అందుకే ఆ విలన్ పాత్ర నాకు వద్దు అని చెప్పాను. నేను ఎప్పుడూ కొట్టే వాడిగానే ఉండాలి, దెబ్బలు తినేవాడిగా ఉండకూడదు” అని నవ్వులు పూయించారు.
సినిమాపై అంచనాలు
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదట్లో ఈ సినిమా తమిళ చిత్రం తెరికి రీమేక్ అని ప్రచారం జరిగినా, దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి పోలీస్ కాప్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. అయితే, మల్లారెడ్డి ఈ పాత్రను తిరస్కరించిన కారణంగా, ప్రస్తుతం ఆ విలన్ రోల్‌లో కోలీవుడ్ నటుడు ఆర్. పార్థిబన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























