రికార్డు సృష్టించిన కాంతార చాఫ్టర్ 1

Kantara Chapter 1 Sets New Box Office Record

కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 కర్ణాటక బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. మొదటి నాలుగు రోజులు 80కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్న ఈసినిమా నిన్న వర్కింగ్ డే లోకూడా సెన్సేషనల్ హోల్డ్ చేయడంతో 90కోట్ల మార్క్ చేరుకుంది.ఇక ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ నిన్నటి కన్నా ఎక్కువగా ఉండడం తో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి కన్నడ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కనుంది.ఫుల్ రన్ లో అక్కడ ఈసినిమా 200కోట్ల మార్క్ చేరుకునేలానే వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మిగితా భాషల్లో కూడా కాంతార చాప్టర్ 1 సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. కేరళ లో ఈసినిమా నిన్నటి తో 26కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిట్ దిశగా దూసుకుపోతుంది. తమిళనాడులో కూడా సూపర్ రన్ తో టార్గెట్ కు చేరువైంది. అయితే హిందీ ,తెలుగులో వసూళ్లు బాగానే వున్నా ఈసినిమాను ఎక్కువ రేట్లకు అమ్మడంతో ఇప్పటివరకు టార్గెట్ లో సగానికిపైగా మాత్రమే రికవరీ చేసింది.దీపావళి వరకు వేరే సినిమాలతో పోటీ లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.

అటు నార్త్ అమెరికా లో ఈసినిమా 2.8 మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఓవరాల్ గా 5రోజుల్లో కాంతార చాప్టర్ 1 370కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 500 కోట్లపైనే రాబట్టాల్సివుంటుంది.

రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.