గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది.ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇక ఈసినిమా నుండి దసరాకు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే హీరో రామ్ చరణ్ , హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్యలో వచ్చే ఈ లవ్ సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేశారు.త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేసి లిరికల్ వీడియో లో కొన్ని స్టెప్స్ యాడ్ చేయనున్నారు. కుదిరితే ఫస్ట్ సింగిల్ ను దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక డిసెంబర్ లోపు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు.పెద్దిలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తుండగా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది థియేటర్లోకి రానుంది.ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే ఈసినిమాకు సరిగ్గా ఒక్క రోజు ముందు నాని ది ప్యారడైజ్ విడుదలకానుంది.ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























