‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో శ్రీ విష్ణు మరియు దర్శకుడు రామ్ అబ్బరాజుల సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఈసారి ఈ క్రేజీ కాంబోను టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దసరా సందర్భంగా ప్రాజెక్ట్ లాంచ్:
విజయదశమి పండుగ సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై (నవీన్ యెర్నేని, వై. రవిశంకర్) లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకు ప్రస్తుతానికి ‘శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2’ అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు.
అంచనాలు అమాంతం పెంచిన ప్రీ-లుక్:-
ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ఈసారి కూడా వినోదం డబుల్ డోస్‌లో, ఇంకా వైల్డ్‌గా ఉంటుందనే సంకేతాలు ఈ పోస్టర్ ద్వారా కనిపిస్తున్నాయి. కంప్లీట్ డిఫరెంట్ స్టయిల్లో కొత్త కథాంశంతో కూడిన ఫ్రెష్ స్క్రిప్ట్. కాన్సెప్ట్, హై-వోల్టేజ్ హ్యుమర్ ఎక్కువగా వుండే కథనంతో, ఈ చిత్రం నాన్-స్టాప్ వినోదాన్ని అందించబోతోందని అర్ధమవుతోంది.
సామజవరగమన బృందం రిపీట్!
‘సామజవరగమన’ చిత్రానికి రచయితలుగా పనిచేసిన భాను భోగవరపు మరియు నందు ఈ కొత్త చిత్రానికి కూడా స్క్రిప్ట్ అందిస్తుండటం విశేషం. దీంతో ఈసారి వినోదం మరింత పెద్ద స్థాయిలో ఉండబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు:-
- ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రముఖ నటులు సాయిదుర్గ తేజ్, నారా రోహిత్, నరేష్, వెన్నెల కిషోర్ వంటి వారు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
- త్వరలోనే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.
మొదటి సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ హిట్ కాంబో, ఈసారి మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద సంస్థ అండతో ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























