మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. దసరా కానుకగా ‘మీసాల పిల్లా’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రోమో హైలైట్స్..
- చిరు-నయన్ కెమిస్ట్రీ: ఈ పాట ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య సరదా సంభాషణ మరియు టీజింగ్ సన్నివేశం ఆకట్టుకుంటోంది.
- ‘మీసాల పిల్లా’ అంటే ఏంటి?: నయనతారను చిరంజీవి ‘మీసాల పిల్లా’ అని పిలవడం, దాని అర్థం తెలియక ఆమె సీరియస్ అవ్వడం, దానికి చిరంజీవి “మీసాల పిల్లా అనేది తిట్టు కాదు.. మా ఊర్లో మొగరుబోతు పిల్లని క్యూట్‌గా అలా పిలుస్తారు” అని చెప్పడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.
- భీమ్స్ మ్యూజిక్: మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ పాట బీట్స్ మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. చిరంజీవి మార్క్ డ్యాన్స్, స్టైల్ ఈ పాటలో పుష్కలంగా ఉండబోతున్నాయని ప్రోమో స్పష్టం చేస్తోంది. భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు.
సంక్రాంతి పండక్కి మెగా ట్రీట్..
చిరంజీవి అసలు పేరు (కొణిదెల శంకరవరప్రసాద్)ను టైటిల్‌గా పెట్టడం, దర్శకుడు అనిల్ రావిపూడి టేకింగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట ప్రోమోతో సినిమాపై ఉన్న హైప్ మరింత రెట్టింపైంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Jr NTR Emotional Speech | Kantara Chapter 1 Pre Release Event | Rishab Shetty | Rukmini Vasanth
07:23

Civil Engineer Vs Corrupt Builder 🔥 | VIP 2 Telugu Movie Scene | Dhanush | Kajol | Telugu FilmNagar
09:45

OG DAY 2 Public Talk @ Prasads | OG Second Day Public Talk | Pawan Kalyan | Thaman S | Sujeeth | TFN
03:52

Director Sujeeth Emotional Speech | OG Success Celebration | Pawan Kalyan | Priyanka Mohan | Thaman
02:20
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























