ఓజీ టికెట్ హైక్ జీవో రద్దు చేసిన తెలంగాణ హై కోర్టు 

Telangana High Court Cancels OG Ticket Hike GO

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.తెలంగాణలో ఈసినిమాకు ప్రభుత్వం ప్రీమియర్స్ షోస్  తోపాటు 10రోజుల వరకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేశారు.హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఇలాంటి ఉత్తర్వులను జారీ చేసే అధికారం లేదని పిటిషనర్ వాదించారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లేదా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లకు మాత్రమే ఇలాంటి మెమోలు జారీ చేసే అధికారం ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని, టికెట్ల ధరల పెంపును అనుమతించిన మెమోను సస్పెండ్ చేసింది.తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా పడింది.

ఈ జీవో ప్రకారం సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోకు రూ. 800 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆ జీవోను తెలంగాణ హై కోర్టు రద్దు చేసింది. అయితే  ప్రేక్షకులు ఆల్రెడీ  ప్రీమియర్స్  షోస్ తోపాటు మూడు రోజులకుగాను టికెట్స్ కూడా బుక్ చేసుకోవడంతో హై కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రభావం వీటిపై ఉండబోదు.ఇక ఈ టికెట్ హైక్స్  విషయంలో మరో జీవో వచ్చే అవకాశాలు వున్నాయి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.