మాస్ మహా రాజా రవితేజ 75వ సినిమా మాస్ జాతర ఆగస్టు 27నే రిలీజ్ కావాల్సివుండగా షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదాపడింది.సాంగ్ షూట్ తోపాటు కొన్ని సీన్స్ షూట్ చేయాల్సివుండగా రీసెంట్ ఆ షూట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.దసరా రోజు అక్టోబర్ 2న ఈ రిలీజ్ డేట్ ను రివీల్ చేయనున్నారని సమాచారం. అక్టోబర్ 31న ఈసినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు వున్నాయి.ఇక ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు అలాగే టీజర్ రిలీజవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది.వీరిద్దరికి ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీరి కాంబోలో ధమాకా రాగ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.రవితేజ లాస్ట్ హిట్ కూడా ఇదే.మరి మాస్ జాతరకు కూడా ఈ సెంటిమెంట్ కలిసిస్తుందో చూడాలి.ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తన 76వ సినిమాలో నటిస్తున్నాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఫారెన్ షెడ్యూల్ జరుగుతుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























