మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా కోసం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఫస్ట్ పార్ట్ కాంతార ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాంతో ఈ ప్రాంచైజీ లో వస్తున్న కాంతార చాప్టర్ 1 పై అంచనాలు పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈసినిమా ట్రైలర్ కోసం సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు ట్రైలర్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేతుల మీదగా విడుదలయ్యింది.ఇక ఈ ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్ హైలైట్ అనిపించుకున్నాయి.అజినీష్ లోక్ నాథ్ బీజీఎమ్ అలాగే సౌండ్ మిక్సింగ్ ట్రైలర్ వావ్ అనిపించేలాచేశాయి. ఓవరాల్ గా ట్రైలర్ అయితే అంచనాలకు తగ్గట్లే ఉండి హైప్ మరింత పెంచింది.
రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. అక్టోబర్ 2 న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కాంతార చాప్టర్ 1 1000 కొల్లగొట్టే ఛాన్స్ కూడా లేకపోలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























