ఓజీ మేనియా.. వేలంలో లక్షలు పలుకుతున్న టిక్కెట్లు

OG Mania Power Star Fans Bid Lakhs For Tickets in Auctions

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కోసం మాములు క్రేజ్ లేదు! ఇది సినిమా కాదు, ఒక ఊరమాస్ పండగ! విడుదలకు ఇంకా సమయం ఉన్నా, పవర్ స్టార్ హవా ఇప్పటికే మొదలైపోయింది. ఈ సినిమా కోసం అభిమానులు చూపిస్తున్న ఉత్సాహం చూసి బాక్సాఫీస్ టెన్షన్ పడుతుంది!

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్షలు పలుకుతున్న టికెట్లు..

నిజాం ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాలకే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్ల ముందు ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. చాలామంది పండుగ వాతావరణంలో ఉన్నారు. కొన్ని చోట్ల, మొదటి రోజు, మొదటి షో టికెట్లు వేలంలో లక్షల్లో పలికాయి. బెంగళూరులో రూ. 3.61 లక్షలు, చెన్నైలో రూ. 1.72 లక్షలు, చిత్తూరులో రూ. 1 లక్ష పలికిన టికెట్లు పవన్ కళ్యాణ్ పవర్‌ను మరోసారి చాటిచెప్పాయి.

అభిమానుల ప్రేమ.. జనసేనకు సాయం!

‘ఓజీ’ క్రేజ్‌ను కేవలం టికెట్ల కోసం మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు మద్దతుగా అభిమానులు వాడుకుంటున్నారు. వేలంలో పలికిన ఈ డబ్బును అభిమాన సంఘాలు చెక్కుల రూపంలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు అందజేస్తున్నాయి. ఈ చెక్కులను ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారి చేతుల మీదుగా జనసేన పార్టీకి అందజేయడం విశేషం. ఇది పవన్ కళ్యాణ్ అంటే సినిమా హీరో మాత్రమే కాదు, ప్రజల నాయకుడు అని అభిమానులు చాటిచెబుతున్నారు.

‘ఓజీ’ ఏ రేంజ్‌లో..

ఈ సినిమా కేవలం ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా కాదు. ఇందులో దర్శకుడు సుజిత్ చూపించిన మాస్, స్టైల్, గంభీరత, ఎమోషన్స్, యాక్షన్.. అన్నీ సినిమాను మరోదశకు తీసుకెళ్లాయి. దీంతో ఈ చిత్రం రిలీజయ్యాక అందరి అంచనాలను బద్దలుకొట్టి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయం అని మూవీ లవర్స్ సహా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ జపనీస్ పాటతో మరింత హైప్..

ఇక ఈ సినిమాలో తాజాగా పవన్ కళ్యాణ్ పాడిన ‘వాషి యో వాషి’ పాట వీడియో ఎప్పుడైతో టీమ్ రిలీజ్ చేసింది.. అప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. అన్ని పాటలూ చార్ట్ బస్టర్ హిట్ కావడంతో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల రోజున ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈసారి చరిత్ర పునరావృత్తం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.