చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది లిటిల్ హార్ట్స్.ఇప్పటికే భారీ విజయం సాధించి దాదాపు 18కోట్లకుపైగా లాభాలను అందించిన ఈసినిమా తాజాగా మరో రేర్ ఫీట్ సాధించింది.యూఎస్ఏ లో ఈసినిమా 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.ఓ కొత్త హీరో తన మొదటి సినిమాతోనే ఈక్లబ్ లో చేరడం సౌత్ లో ఇదే మొదటి సారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఫుల్ రన్ లో 40కోట్ల మార్క్ ను చేరుకొనే ఛాన్స్ వుంది. అయితే వచ్చే వారం పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుండడంతో లిటిల్ హార్ట్స్ కు భారీ పోటీ ఎదుర్కోనుంది.
90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి ,యువ హీరోయిన్ శివాని నాగరం జంటగా నటించిన ఈసినిమాను సాయి మార్తాండ్ తెరకెక్కించగా సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందించాడు.యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో కామెడీ హైలెట్ అయ్యింది.#90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈసినిమాను నిర్మించాడు.ఇక ఈసినిమా థియేట్రికల్ రన్ తరువాత ఈటీవీ విన్ లోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























