మళ్లీ వస్తోన్న నాగ్ ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ

Nagarjuna-RGV's Cult Classic Shiva Re-Releasing on November 14

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి సందర్భంగా ‘శివ’ 4K డాల్బీఆట్మాస్ రీ-రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు కింగ్ నాగార్జున. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. 1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “నాన్నగారు ఎప్పుడూ సినిమాకి తరాలకు మించి జీవించే శక్తి ఉందని నమ్మారు. శివ అలాంటి ఒక చిత్రం. నవంబర్ 14న ‘శివ’ పూర్తిగా కొత్త అవాతర్ లో 4K డాల్బీ అట్మాస్‌తో మళ్ళీ బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనే నాన్న గారి కలకు నివాళి.” అని పేర్కొన్నారు.

అలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. “ఈ సారి ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ వినని విధంగా, పూర్తిగా కొత్త అనుభూతిని పొందుతారు. ఆ అనుభవాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నాను.” అని అన్నారు. కాగా ఇండియన్ సినిమాను ‘బిఫోర్ శివ’ & ‘ఆఫ్టర్ శివ’ గా రీడిఫైన్ చేసిన శివ గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ‘శివ’ మళ్లీ బిగ్ స్క్రీన్ అదరగొట్టడానికి సిద్ధమైంది. ఈసారి అద్భుతమైన 4K విజువల్స్ తో పాటు, ఇప్పటి వరకు ఏ రీ-రిలీజ్‌ సినిమాకు లేని విధంగా, డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది. మోనో మిక్స్‌లో ఉన్న శివ సౌండ్‌ను అత్యాధునిక AI టెక్నాలజీతో రీ-మాస్టర్‌ చేసి, అడ్వాన్స్ డాల్బీ ఆట్మాస్‌లోకి మార్చారు.

‘శివ’ ప్రత్యేకత అప్పుడు తన టైమ్స్ లోని సాంప్రదాయాలను ధైర్యంగా చెరిపేసిన విధానం మాత్రమే కాదు, అప్పట్లోనే చేసిన అత్యాధునిక సౌండ్ డిజైన్ లోనూ ఉంది. ఇప్పుడు రీ-రిలీజ్‌లో తీసుకొచ్చిన టెక్నాలజీ అప్‌గ్రేడ్స్‌తో ఈ సినిమా మరో కొత్త అనుభవాన్ని అందించబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.